
| ఈ ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో జెర్మనీ గత 23 ఏళ్లుగా ఎన్నడూ లేనటువంటి అద్భుతమైన స్థూల జాతీయ ఉత్పత్తి రేటు(జీడీపీ)ను ప్రకటించింది. ఈ ఆర్థిక సంవత్సరం జూన్ 30తో ముగిసిన రెండో త్రైమాసికంలో జర్మనీ స్థూల దేశీయ ఉత్పత్తి రేటు(జీడీపీ) 2.2శాతానికి పెరిగినట్లు తెలిపింది. |
| ముంబై స్టాక్ మార్కెట్‌లో సెన్సెక్స్ సూచీ బుధవారం 21 పాయింట్ల వృద్ధితో ముగిసింది. ఫలితంగా ట్రేడింగ్ ముగిసే సమయానికి 18,666 వద్ద స్థిరపడింది. అయితే, నిఫ్టీ మాత్రం కేవలం మూడు పాయింట్లు లాభపడి 5607 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్‌లు బలహీనపడటం వల్ల స్టాక్ మార్కెట్ సానుకూలంగా ముగిసింది. |
| హైదరాబాద్: ఉస్మానియా విశ్వవిద్యాలయంలో వాల్యుయేషన్ కు వచ్చిన సీమాంధ్ర అధ్యాపకులపై విద్యార్థులు దాడి చేయడంపై గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కె. రోశయ్య సీరియస్ అయినట్లు వచ్చిన వార్తపై తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు తీవ్రంగా ప్రతిస్పందించారు. ముఖ్యమంత్రి, గవర్నర్ సీరియస్ అయితే మేం కాలేమా అని ఆయన అడిగారు. విశ్వవిద్యాలయంలో విద్యార్థులు |
| వారాంతమైన శుక్రవారం బాంబే స్టాక్ మార్కెట్ కుప్పకూలింది. దేశీయ వాటాలు అమ్మకాల ఒత్తిడికి గురికావడంతో సెన్సెక్స్ 247 పాయింట్ల భారీ నష్టంతో 18వేల (17,979) మార్కు దిగువ స్థాయికి పడిపోయింది. గతవారం 30నెలల గరిష్ఠ స్థాయికి చేరుకున్న సెన్సెక్స్, ఈ వారాంతం 18వేల పాయింట్ల కనిష్ఠ స్థాయికి చేరుకుంది. |
| సినిమాని హైప్ చేసుకునేందుకు నోటికొచ్చిన లెక్కలు చెబుతుంటారు నిర్మాతలు. ముఖ్యంగా ప్రింట్లు, థియేటర్ల విషయంలో తమకు తోచిన నంబర్ చెప్పి అదే నిజమనుకునేలా పదేపదే జనం మీద రుద్దుతారు. వెయ్యి థియేటర్లలో విడుదల చేస్తున్నామని అయిదారొందల ప్రింట్లు పెడుతున్నామని కాకి లెక్కలు చెప్పేస్తారు. వెర్రి అభిమానులు అదంతా నిజమేనని నమ్మేస్తుంటారు. అయితే ప్యూచర్ చూసుకోకుండా ఇలా వేలాది |
| దివంగత నేత వై.ఎస్. రాజశేఖర రెడ్డి లక్ష్యాలు, ఆశయాలు నెరవేరాలంటే కడప ఎంపీ వై.ఎస్. జగన్ ముఖ్యమంత్రి కావాల్సిందేనని నటుడు నరేష్ అన్నారు. తండ్రి ఆశయాలను తనయుడైన వై.ఎస్. జగన్ నెరవేర్చాలంటే ఆయన ముఖ్యమంత్రి కావాల్సిన అవసరముందని నరేష్ ఆశించారు. వైఎస్ ఆశయాలను కొనసాగించడానికి జగన్ ముందుకు వస్తున్నారని, జగన్ మిషన్‌ను అందరూ బలపరచాల్సి ఉందని ఆయన చెప్పారు. |
| మన్నవరం: వైఎస్ కృషి వల్లే మన్నవరంలో ఎన్టీపీసీ-భెల్ ప్రాజెక్టు ఏర్పాటు అవుతోందని ప్రధాని మన్మోహన్ సింగ్ అన్నారు. మన్నవరం ప్రాజెక్టుకు బుధవారం శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన ప్రసంగించారు. మన్నవరం ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందని చెప్పారు. వైయస్ వర్ధంతికి ఒక్క రోజు ముందుగా ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయడం కూడా ఆనందంగా ఉందని ఆయన |
| ఇకపై ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వాణిని మరింత బలంగా వినిపించాలని తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ ఎంపీలు నిర్ణయించారు. ఈ మేరకు ఆ పార్టీ సీనియర్ నేత కె.కేశవరావు నివాసంలో గురువారం ఉదయం న్యూఢిల్లీలో సమావేశమై తీర్మానించారు. |
| జన హృదయ నేత వైఎస్సార్ మృతిని తట్టుకోలేక మరణించిన కుటుంబాలను పరామర్శించడానికి వై.ఎస్ జగన్ చేపట్టిన ఓదార్పు యాత్ర శుక్రవారం నుంచి ప్రకాశం జిల్లాలో జరుగనుంది. తల్లి విజయమ్మ ఆశీర్వాదం తీసుకుని కడప ఎంపీ వై.ఎస్. జగన్మోహన రెడ్డి శుక్రవారం ప్రకాశం జిల్లా ఓదార్పు యాత్రకు ప్రయాణమయ్యారు. |
| బాంబే స్టాక్ మార్కెట్ గురువారం లాభాలతో ముగిసింది. గురువారం సాయంత్రం ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 32 పాయింట్లు పుంజుకుని 18238 పాయింట్ల మార్కు వద్ద స్థిరపడింది. అలాగే నిఫ్టీ కూడా 14 పాయింట్ల స్వల్ప లాభంతో 5,486 పాయింట్ల మార్కును తాకింది. |
| అమెరికా ఓపెన్ గ్రాండ్ స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌లో భారత టెన్నిస్ సంచలనం సానియా మీర్జా పోరు ముగిసింది. ఈ టోర్నీ తొలి రౌండ్లో విజయాన్ని నమోదు చేసుకున్న సానియా మీర్జా రెండో రౌండ్లో చిత్తుగా ఓడిపోయింది.ప్రస్తుతం 159 ర్యాంకులో ఉన్న సానియా మీర్జా మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో అనాస్టాసియా చేతిలో ఖంగుతింది. రష్యాకు చెందిన అనస్టాసియాతో బరిలోకి దిగిన సానియా మీర్జా ప్రత్యర్థి షాట్లను ధీటుగ |
| హైదరాబాద్: ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బీఈడీ స్పాట్ వాల్యూయేషన్ సందర్బంగా సీమాంధ్ర అధ్యాపకులపై దాడికి పాల్పడిన నలుగురు విద్యార్ధులను పోలీసులు బుధవారం ఉదయం అరెస్టు చేశారు. వీరబాబు, సైదులు, జగన్, శ్రీనివాస్‌లను అదుపులోకి తీసుకున్నారు. దీంతో అరెస్టు అయిన వారిని వెంటనే విడుదల చేయాలని ఓయూ విద్యార్ధి జేఏసీ పోలీసులను డిమాండ్ చేశారు. ఈ ఘటనలో 20 మంది |
| న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్ వోటింగ్ యంత్రాలపై (ఈవీఎంలపై) అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత కేంద్ర ఎన్నికల సంఘానికి ఉందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఈవీఎంలపై పార్టీల మద్దతు కూడగట్టేందుకు మంగళవారం ఢిల్లీ వచ్చిన చంద్రబాబు బుధవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. బీఎస్పీ, జేడీయూ, అన్నాడీఎంకే సహా అన్ని పార్టీలు ఈవీఎంలపై అభ్యంతరాలు వ్యక్తం |
| తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చేపట్టిన ఆమరణ నిరాహారదీక్షను తిరుపతి పోలీసులు మంగళవారం తెల్లవారుజామున భగ్నం చేశారు. ఈనెల 20వ తేదీ నుంచి దీక్ష చేపట్టిన కరుణాకర్ రెడ్డి ఆరోగ్యం బాగా క్షీణించడంతో పోలీసులు ఈ చర్య చేపట్టారు. అనంతరం ఆయనను తిరుపతిలోని రుయా ఆస్పత్రికి తరలించారు. |
| అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లు మిశ్రమ ఫలితాలను నమోదు చేసుకున్నాయి. బాంబే స్టాక్ మార్కెట్‌తో పాటు యూరప్ మార్కెట్ వృద్ధిని నమోదు చేసుకోగా, ఆసియా, అమెరికా స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కూరుకుపోయాయి. |
| హైదరాబాద్: కాంగ్రెసు సీనియర్ నాయకుడు జి. వెంకటస్వామి (కాకా) తమను బెదిరిస్తున్నారని సినీ నటుడు శ్రీకాంత్ అన్నారు. రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం శివరాం పల్లిలోని భూమి తమదేనని ఆయన ఆదివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. తన మరదలికి చెందిన ఆ భూమిని కబ్జా చేసేందుకు కాకా ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. భూముల్లో జెండాలు పాతడం ఇప్పటి |